కర్నూలు జిల్లా నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో మహేశ్ అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్‌ను బంధువులు గుర్తించారు.
అమ్మా.. నాన్నా.. క్షమించండి..!
"అమ్మా, నాన్న.. క్షమించండి. ఈ నెల 5 వ తేదిన జరిగిన ఘర్షణలో పుట్టా సుబ్బారాయుడు, పుట్టా కిశోర్ కలిసి నన్న కొట్టారు. అందుకే అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఈ ఘర్షణపై గోస్పాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దానికి సంబంధించిన లెటర్ నా బాక్సులో సెల్‌ఫోన్ కవర్లో ఉంటుంది. నా ఛావుకు కారకులు... పుట్టా వెంకటేశ్వరమ్మ, పుట్టా సుబ్బారాయుడు, పుట్టా రాధ, పుట్టా కిషోర్, పుట్టా సురేశ్" అని సూసైడ్ లెటర్లో మహేష్ ఆరోపించాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.
ఇదీ చదవండి:
రూ.10 వేలు లంచం తీసుకుంటూ.. అనిశాకు చిక్కిన పంచాయతీ కార్యదర్శి