కర్నూలులోని శరీన్ నగర్లో ఓ వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకుంది. జోస్న, జగన్మోహన్రెడ్డికి రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లి జరిగినప్పటి నుంచే ఆమెను.. భర్త వేధించేవాడని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతికి భర్తే కారణమని.. అందువల్లే అతను పరారీలో ఉన్నాడని వారు చెబుతున్నారు. ఈ ఘటనపై నాలుగో పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం పట్టివేత..