కర్నూలు సమీపంలోని పుల్లూరు టోల్ గేట్ వద్ద తెలంగాణ పోలీసులు అంబులెన్సులను అడ్డుకున్నారు. ఈ-పాస్ ఉంటేనే అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్.. తెలంగాణ పరిధి జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు చెక్‌పోస్టు సిబ్బందితో మాట్లాడారు. ఉన్నతాధికారులతో ఫోనులో సంప్రదించారు.
నో పర్మిషన్..
ఈ-పాస్ లేకుండా అనుమతించేది లేదని వారు స్పష్టం చేయటంతో.. బాధిత బంధువులతో హఫీజ్‌ఖాన్ మాట్లాడుతున్నారు. వైద్య చికిత్సల కోసం హైదరాబాద్‌కు పంపించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అంబులెన్సులను అనుమతించమని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని.. ఏపీ సీఎస్ సంప్రదిస్తారని.. తద్వారా సమస్య పరిష్కారమవుతుందని హఫీజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి : ఏపీ తెలంగాణ బోర్డర్ : మరోసారి అంబులెన్సులను నిలిపేసిన తెలంగాణ పోలీసులు