కర్నూలు జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఏటా విభిన్న రూపాల్లో గణపతిని రూపొందించే నంద్యాల శ్రీ భగవత్ సేవా సమాజ్ సభ్యులు ఈ సారి అయిదు వేల మొక్కజొన్న కంకులతో గణపతి ప్రతిమను తీర్చిదిద్దారు. స్థానిక సంజీవనగర్ కోదండ రామాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ శ్రీ అంకుర జూర్ణ మహా గణపతి విగ్రహాన్ని భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ విగ్రహాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.
వినాయక చవితి ఉత్సవాలు.. కర్నూల్లో వేడుకగా జరుపుతున్నారు. నగరంలోని వినాయక ఘాట్ వద్ద నున్న విఘ్నేశ్వరుని దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు వినాయక ఉత్సవాలను జరుపుకుంటున్నారు.
ఇదీ చదవండీ.. శ్రీశైలంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు