తిరుపతిలో పలు హోటళ్లు, రెస్టారెంట్లపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. నగరంలోని ఎంఆర్‌పల్లి ప్రాంతంలో.. ఆహారం నిల్వ, సరైన ప్రమాణాలు పాటించకపోవడంపై వస్తున్న ఫిర్యాదుల మేరకు తనిఖీలు నిర్వహించారు. రంగులు అధికంగా వాడిన, ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచిన హోటళ్ల యజమానులకు నోటీసులు జారీ చేశారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో రెండు బార్ అండ్ రెస్టారెంట్లపై.. విజిలెన్స్, ఆహార భద్రత సిబ్బంది దాడులు చేశారు. కాలం చెల్లిన మాంసం నిల్వ చేసి వినియోగదారులకు అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీప్తి బార్ నిర్వాహకుడికి రూ. 50 వేలు, రెడ్ చిల్లీ బార్ యజమానికి రూ. 20 వేలు చొప్పున జరిమానా విధించారు.
ఇదీ చదవండి: