Rayalaseema University: రాయలసీమ యూనివర్శిటీ ఉపకులపతి ఆనందరావు, రిజిస్ట్రార్ మధుసూదన్ వర్మలు కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు హాజరయ్యారు. వర్శిటీ పూర్వ విద్యార్ధులు శ్రీరాములు, నాగరాజులు యూనివర్శిటీలో కోర్సులో చేసేందుకు అడ్మిషన్ కోరారు. రెండు పీజీల కంటే ఎక్కువ చదవ కూడదని పాలకమండలిలో నిర్ణయం తీసుకున్నామని.. వర్శిటీ అధికారులు చెబుతూ అడ్మిషన్ ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
పిటీషన్‌పై విచారించిన న్యాయస్థానం విద్యార్ధులకు అడ్మిషన్స్ ఇవ్వాలని గతంలో ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను వర్శిటీ ఉపకులపతి, రిజిస్ట్రార్ అమలు చేయక పోవటంతో పిటిషనర్లు కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణకు హాజరైన వర్శిటీ వీసీ, రిజిస్ట్రార్లు.. విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తున్నామని కోర్టుకు తెలిపారు.
ఇవీ చదవండి: