ETV Bharat / state

నకిలీ పత్రాలతో బ్యాంకులో రుణం - వెల్దుర్తిలో నకిలీ పత్రాలతో బ్యాంకులో రుణం

కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడికి చెందిన పొలంపై బినామీలు కొందరు బ్యాంకు రుణం పొందారు. నకిలీ పత్రాలను సృష్టించి ఐసీఐసీఐ బ్యాంకులో తనఖాపెట్టి రూ.8 లక్షల రుణం పొందారు. ఇది తెలుసుకున్న ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు నిర్ఘాంతపోయారు.

unknown persons take loan with duplicate pass books in veldurthi kurnool district
నకిలీ పత్రాలతో బ్యాంకులో రుణం
author img

By

Published : Jun 11, 2020, 7:33 PM IST

కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన డి.కృష్ణయ్య విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు. ఇతనికి వెల్దుర్తిలో 703-2 సర్వే నంబరులో 3.20 ఎకరాలు, 135 సర్వే నంబరులో 0.50 సెంట్ల భూమి ఉంది. స్వయంగా సాగుచేసుకుంటున్నారు. తనకు వారసత్వంగా వస్తున్న పొలాన్ని కుమారుడు సాయికృష్ణకు దానవిక్రయం చేసేందుకు డోన్‌ రిజిస్టర్‌ కార్యాలయానికి వెళ్లారు. ఈ పొలంపై ఐసీఐసీఐ బ్యాంకులో రూ.8 లక్షల రుణం ఉందన్న విషయం బయటపడింది. తను పొలాన్ని ఎక్కడా తనఖా పెట్టలేదని, ఐసీఐసీఐ బ్యాంకులో తనకు కనీసం ఖాతా కూడా లేదని ప్రధానోపాధ్యాయుడు వాపోయారు. తన పేరుతో నకిలీ వ్యక్తులు రుణం పొందినట్లు భావించి కర్నూలులోని బ్యాంకుకు వెళ్లి విచారించారు.

12.20 ఎకరాలున్నట్లు చూపి రుణం

ప్రధానోపాధ్యాయుడికి 2 సర్వే నంబర్లలో మొత్తం 3.70 ఎకరాల భూమి ఉంది. సర్వే నంబర్‌ 703-2లో 3.20 ఎకరాలు, 195 సర్వే నంబరులో 9.00 ఎకరాలు ఉన్నట్లు నకిలీ పాసు పుస్తకం సృష్టించిన ఆగంతకులు బ్యాంకులో రుణం పొందారు. ఉన్న పొలంతో పాటు, లేని పొలాన్ని చూపి ఇతనికి తెలియకుండా రుణం తీసుకున్నారు.

ఇతర రైతుల పేర్లతోనూ..

కృష్ణయ్య ఆంగ్లంలో సంతకం చేస్తారు. బ్యాంకులో రుణం పొందిన పత్రాల్లో తెలుగులో సంతకం చేసినట్లు ఉంది. ఏడాది కిందట నార్లాపురం రెవెన్యూ గ్రామంలోనూ అనేక మంది రైతుల పేరు మీద వారికి తెలియకుండానే.. గుర్తు తెలియని వ్యక్తులు రూ.కోటి వరకు రుణం పొందారు. ఆన్‌లైన్‌లో పొలం వివరాలు మార్చడం, నకిలీ పాసుపుస్తకాలు తయారు చేయడంలో రెవెన్యూ అధికారుల ప్రమేయం ఉన్నట్లు ప్రజలు అనుమానిస్తున్నారు. తన పొలంపై రుణం తీసుకున్న వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ప్రధానోపాధ్యాయుడు కృష్ణయ్య అధికారులను కోరుతున్నారు.

ఇవీ చదవండి:

వరదకి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.