కర్నూలులో సిటీకేబుల్ వైర్ల మరమ్మతుల విషయంలో చోటు చేసుకున్న వివాదం ఇరువర్గాల మధ్య గొడవకు దారి తీసింది. నగరంలోని ప్రకాష్‌నగర్ వద్ద కేబుల్ వైర్లు మరమ్మతులు చేస్తుండగా వ్యవసాయ మార్కెట్ మాజీఛైర్మన్ డీ.వెంకటేశ్వర్ రెడ్డి అక్కడికి చేరుకొని కేబుల్ ప్రసారాలకు అంతరాయం కలిగిస్తున్నారని వారితో వాగ్వాదానికి దిగారు. మరో వర్గానికి చెందిన కే.ఈ కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ ఘటనపై ఇరు వర్గాలపై రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి...