తుంగభద్ర పుష్కరాలు కర్నూలులో ఐదో రోజూ కొనసాగుతున్నాయి. నగరంలోని సంకల్ బాగ్ ఘాట్లో భక్తులు పలుచగా కనిపించారు. మిగిలిన ఘాట్లన్నీ భక్తులు లేక వెలవెలబోతున్నాయి. నాలుగు రోజులుగా నదిలో తగిన స్థాయిలో నీరు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఉన్నతాధికారులు నదిలో నీటిమట్టం పెరిగేలా చర్యలు చేపట్టారు. పుష్కర ఘాట్లు ఖాళీగా ఉండటంతో విధులు నిర్వహిస్తున్న అధికారులు, పోలీసు సిబ్బంది ఫోన్లలో కాలక్షేపం చేస్తున్నారు.
ఇదీ చదవండి: తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి