కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు ప్రమాదంలో నెడుతూ ప్రభుత్వం పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని మొండిగా వ్యవహరించిందని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు మండిపడ్డారు.
ఈ విషయంలో పరీక్షల నిర్వహణను వ్యతిరేకిస్తూ లోకేష్ చేసిన పోరాటం ఫలించిందన్నారు. లోకేష్ మొదటిసారే ప్రభుత్వానికి లేఖ రాసినపుడు పరీక్షలు రద్దు చేసి ఉంటే విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారన్నారు. తెదేపా న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని.. మొండి వైఖరి వీడాలని చెప్పారు. సురేంద్ర రెడ్డి, నాగరాజు,ఉమేష్, పూర్ణ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: