కర్నూలు జిల్లా బనగానపల్లెలో వైకాపా కార్యకర్త మాబాషాపై కొండపేట గ్రామానికి చెందిన ముర్తుజావలి, చాంద్ బాషా, ముస్తఫా అనే ముగ్గురు వ్యక్తులు సుత్తితో దాడి చేశారు. ఇంటి స్థలం విషయంలో వీరి మధ్య వివాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. వివాదంలో గాయపడ్డ బాషాను వెంటనే బనగానపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆస్పత్రికి చేరుకొని బాధితుడిని పరామర్శించారు. తెదేపా కార్యకర్తలు కావాలనే దాడి చేశారని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: బాలికపై అత్యాచారం.. నిందితుడి అరెస్టు