ETV Bharat / state

పోలీస్ స్టేషన్ ఎదుట హిజ్రాల ఆందోళన - kanrnulu latest news

కర్నూలు జిల్లా పంచలింగాల చెక్​పోస్ట్ వద్ద ఎస్​ఈబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన ఆటోలో ప్రయాణిస్తున్న హిజ్రాలు తమను అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు.

knl
పోలీస్ స్టేషన్ ఎదుట హిజ్రాల ఆందోళన
author img

By

Published : Mar 20, 2021, 11:04 PM IST

కర్నూలు జిల్లా డోన్​కు చెందిన ముగ్గురు హిజ్రాలు మద్యం కొనుగోలు చేసి ఆటోలో వస్తుండగా... వంచలింగాల చెక్​పోస్ట్ వద్ద ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. ఈ దాడుల్లో 69 మధ్యం సీపాలు లభ్యమయ్యాయి. హిజ్రాలను అడ్డుపెట్టుకొని ఆటో డ్రైవర్ మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు గ్రహించిన అధికారులు... ఆటోడ్రైవర్ మధుగోపాల్​ను అరెస్టు చేశారు.

ఆటో డ్రైవర్​ను అరెస్టు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హిజ్రాలు... డ్రైవర్​ను, ఆటోను వదిలిపెట్టి తమపై కేసు నమోదు చేయాలని పట్టుబట్టారు. తమ పరిధిలో ఏమీలేదని ఉన్నతాధికారులు చెప్పడంతో... హిజ్రాలు జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. పోలీసు అధికారులు ఆంక్షలు వివరించి హెచ్చరించటంతో నిరసన విరమించారు.

మరో ఘటనలో నగరంలోని కృష్ణనగర్ వద్ద కారును తనిఖీ చేయగా... తెలంగాణ రాష్ట్రానికి చెందిన 456 మద్యం సీసాలను ఎస్ఈబీ సీ.ఐ రాజశేఖర్ గౌడ్ గుర్తించారు. ఒకరిని అరెస్ట్ చేసి, కారు, మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీచదవండి.

ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎండీగా దీవన్‌రెడ్డి నియామకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.