కర్నూలు జిల్లా మహానంది మండలం గోపవరం వద్ద ఓ గోదాములో కంది బస్తాలు మీద పడి నీలమ్మ (65) అనే వృద్ధురాలు మృతి చెందింది. గోపవరం గ్రామానికి చెందిన నీలమ్మ బస్తాల వద్ద శుభ్రం చేస్తోంది. ఒక్కసారిగా బస్తాలు మీద పడడంతో ఊపిరాడక అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ప్రైవేటు గోదామును స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ ప్రతినిధులు నిర్వహిస్తున్నారు. సంఘటనపై మహానంది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: