TEACHERS NIRASANA DEEKSHA: ప్రతి నెలా ఒకటవ తేదీనే జీతాలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలులో నిరసన దీక్ష నిర్వహించారు. డీఏ, పీఎఫ్ తదితర బకాయిలను చెల్లించాలని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి చామల అనిల్ వెంకట ప్రసాద్ రెడ్డి కోరారు. సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలు, మ్యాచింగ్ గ్రాంట్స్ జమ చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధిస్తోందని, గౌరవం లేకుండా మాట్లాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
" ఈరోజు నిరసన చేయడానికి ప్రధాన కారణం ఉపాధ్యాయులకు ప్రతి నెల ఒకటవ తేదిన జీతాలు చెల్లించాలి. ఎందుకంటే ఉపాధ్యాయులలో చాలా మందికి వారి జీతాలే జీవిత ఆధారం. ఎన్నో డీఏ బకాయిలు సకాలంలో చెల్లించడం లేదు. సీపీఎస్ ఉద్యోగులకు అయితే మరీ దారుణం. వాళ్లకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలు ఇవ్వకుండా పన్నులు కట్టించుకుంటున్నారు. ఇంత దారుణమైన పరిస్థితుల నుంచి ఉపాధ్యాయులను బయట పడేయాలి. మా భాద ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈరోజు నిరసన దీక్షకు పూనుకున్నాము. " - అనిల్ వెంకట ప్రసాద్ రెడ్డి, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి
" మేము పోరాడి సంపాదించుకున్న జీతభత్యాల మీద అగౌర పరిచేవిధంగా సమాజానికి, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వైరం తెచ్చే విధంగా పనుల ఉండాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఈ క్రమంలో ప్రతి నెల ఒకటవ తేదిన జీతాలు చెల్లించాలి. అదే విధంగా డీఏ బకాయిలకు సంభందించి పది వేల కోట్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాకు సకాలంలో రావలసిన అన్ని ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నాం. ముందు ముందు ఇలా చేస్తే మా ఉద్యమ కార్యచరణను అమరావతి వరకు తీసుకుపోతామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. " - హృదయరాజు, ఏపీటీఎఫ్ అధ్యక్షులు
ఇవీ చదవండి