కర్నూలుకు హైకోర్టు రావాలంటూనే.. మరో వైపు అడ్డుకునేందుకు తెదేపా నాయకులు కేసులు వేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు. కర్నూలు ఔట్డోర్ స్టేడియంలో ఏపీ సీఎం కప్ సెపక్ తక్రా పోటీలను మంత్రి గుమ్మనూరి జయరాంతో కలసి ఆయన ప్రారంభించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుపై ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. రాయలసీమకు రిజర్వాయర్లను తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందన్నారు. చంద్రబాబు హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు.
ఇదీ చదవండి: