కర్నూలులో హైకోర్టు త్వరగా ఏర్పాటు చేయాలని టీజీ వెంకటేశ్ కోరారు. రాయలసీమలో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తే.. వికేంద్రీకరణ సరిగా చేసిన వారవుతారని వ్యాఖ్యానించారు. చేయకపోతే... భాజపా అధినాయకులను సంప్రదించి... పోరాటాలు చేస్తామన్నారు. కర్నూలు ఆసుపత్రిని ప్రాంతీయ కొవిడ్ ఆసుపత్రిగా మార్చాలని టీజీ వెంకటేశ్ కోరారు. కరోనా వ్యాక్సిన్ వచ్చేందుకు సమయం పడుతుందని అంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి: గవర్నర్‌కు రాసిన లేఖలో చంద్రబాబు చెప్పినవన్నీఅబద్ధాలే: బొత్స