తగ్గిన టమాట ధర.. రోడ్డుపై పారబోసి రైతన్నల ఆందోళన - టమాట రైతుల ఆందోళన
టమాట ధరలు భారీగా పతనం కావటంతో కర్నూలు జిల్లాలో రైతులు నిరనస వ్యక్తం చేశారు. టమాటలను రోడ్డుపై పడేసి ఆందోళన నిర్వహించారు. దేవనకొండ మార్కెట్లో కిలో టమాట కనీసం రూపాయి ధర కూడా పలకటం లేదని వాపోయారు. దిక్కుతోచని పరిస్థితుల్లో కర్నూలు- బళ్లారి రహదారిపై టమాటాలను పారబోసి రైతులు వెళ్లిపోయారు.
తగ్గిన టమాట ధర..రోడ్డుపై పారబోసి రైతన్నల ఆందోళన