శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్ల నుంచి వరద నీరు స్వల్పంగా పారుతోంది. జలాశయ నీటి మట్టం గరిష్ట స్థాయిలో కొనసాగించాలని ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నట్లు డ్యాం పర్యవేక్షక ఇంజినీర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కారణంగా అలల ప్రవాహం వల్ల నీరు బయటకు వస్తోందన్నారు. రాయలసీమ ప్రాంత తాగునీటి పథకాలకు నీరందించేందుకు శ్రీశైలం జలాశయం నీటిమట్టం గరిష్ట స్థాయిలో నిర్వహణ చేపడుతున్నామని చెప్పారు.
మరో వైపు.. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి 65,039 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుంది. శ్రీశైలం జలాశయం 65,039 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుత నీటినిల్వ 215.8070 టీఎంసీలు గా నమోదైంది. శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 27,613 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులరేటర్ కు 33,666 క్యూసెక్కులు, హంద్రీనీవా కు 2026 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2028 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఇదీ చదవండి: