శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. జలాశయానికి 4 లక్షలా 3 వందలా 90 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. 4 లక్షలా 67 వేలా 451 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 3,51,622 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 48,768 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది.
జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 883.80 అడుగులు ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 208.72 టీఎంసీలకు చేరింది.
ఇదీ చదవండీ.. murder: రౌడీ షీటర్ హత్య.. సన్నిహితులే కారణం అని అనుమానం