ETV Bharat / state

Freedom Fighter: స్వాతంత్య్ర సంగ్రామ శిఖరం గాడిచర్ల హరిసర్వోత్తమరావు

తెలుగు నేలపై స్వాతంత్య్ర పోరాటం సాగించిన యోధానుయోధుల్లో గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఒకరు. పత్రికా సంపాదకుడిగా, సాహితీవేత్తగా, వయోజన విద్య, గ్రంథాలయ ఉద్యమ నిర్మాతగా విశేష ఖ్యాతి గడించిన మహనీయుడు ఆయన. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన తెలుగు వీరుడు. స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా గాడిచర్ల జీవిత విశేషాలను స్మరించుకుందాం.

Freedom Fighter
స్వాతంత్య్ర సంగ్రామ శిఖరం గాడిచర్ల హరిసర్వోత్తమరావు
author img

By

Published : Sep 27, 2021, 7:03 AM IST

తెలుగు నేలపై స్వాతంత్య్ర పోరాటం సాగించిన యోధానుయోధుల్లో గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఒకరు. పత్రికా సంపాదకుడిగా, సాహితీవేత్తగా, వయోజన విద్య, గ్రంథాలయ ఉద్యమ నిర్మాతగా విశేష ఖ్యాతి గడించిన మహనీయుడు ఆయన. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన తెలుగు వీరుడు. స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా గాడిచర్ల జీవిత విశేషాలను స్మరించుకుందాం.

మాతృభూమి దాస్య శృంఖలాలు తెంచడమే లక్ష్యంగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాన్ని తృణప్రాయంగా త్యజించిన త్యాగశాలి.. తెల్లదొరల అణచివేతను, జైలుశిక్షలను లెక్కచేయక దేశం కోసం పోరాడిన అసమాన యోధుడు 'గాడిచర్ల హరిసర్వోత్తమరావు'. 1883 సెప్టెంబర్ 14న కర్నూలులో జన్మించారు. పూర్వీకులది కడప జిల్లా సింహాద్రిపురం. తండ్రి ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాల్లో ఆయన విద్యాభ్యాసం సాగింది. ప్రతిభా పారితోషికాలతో M.A. పూర్తిచేశారు.

1907లో రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ పొందుతుండగా.. స్వాతంత్య్ర సమరాంగణంలో అడుగుపెట్టారు. అది మొదలు.. దేశానికి స్వాతంత్య్రం వచ్చేదాకా వెనుదిరిగి చూడక.. మొక్కవోని దీక్షతో సాగిపోయారు.

ఉపాధ్యాయ శిక్షణ సమయంలో బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసం.. గాడిచర్లను గట్టిగా ప్రభావితం చేసింది. ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకున్న ఆయన.. తోటి శిక్షణార్థులతో కలిసి వందేమాతరం బ్యాడ్జీలు ధరించి తరగతులకు హాజరయ్యారు. తీవ్రంగా పరిగణించిన బ్రిటిష్ ప్రభుత్వం.. కళాశాల నుంచి గాడిచర్లను బహిష్కరించింది. ఎక్కడా ఉద్యోగం ఇవ్వరాదని ఉత్తర్వులు జారీ చేసింది. ఏ మాత్రం వెరవని గాడిచర్ల.. పత్రికా రంగంలో అడుగుపెట్టారు. 'స్వరాజ్య' పత్రికను స్థాపించి, బ్రిటిష్ పాలనపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. 1908 తిరునల్వేలి పోలీసు కాల్పుల ఘటనలో ముగ్గురి మృతిని తీవ్రంగా గర్హిస్తూ.. 'క్రూరమైన విదేశీ పులి' పేరిట సంపాదకీయం రాశారు. ఆయనపై కత్తిగట్టిన బ్రిటిష్ ప్రభుత్వం.. మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. వెల్లూరు జైల్లో బందిపోట్లు, గజదొంగల మధ్య బంధించింది.

తిలక్ హోంరూల్ ఉద్యమానికి ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా కదం తొక్కారు గాడిచర్ల. కాకినాడ కాంగ్రెస్ సభల సమయంలో హిందూస్థానీ సేవాదళ్ ఏర్పాటులో ప్రముఖపాత్ర వహించారు.

హరిజనోద్దరణ, ఖాదీ ఉద్యమం, మద్యపాన నిషేధం, సహకార సంఘాల పోరాటం సహా సంగ్రామ సమయంలో.. అన్నిరకాల పోరాటాల్లోనూ కీలకంగా ఉన్నారు. 1927లో కాంగ్రెస్ అభ్యర్థిగా నంద్యాల నుంచి మద్రాస్‌ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేట్ సభ్యుడిగానూ పని చేశారు. 1930 నుంచి రాజకీయ కార్యకలాపాలు తగ్గించుకుని.. ప్రీతిపాత్రమైన గ్రంథాలయోద్యమం వైపు మళ్లారు. ఆంధ్ర గ్రంథాలయ సంస్థకు జీవితకాలం అధ్యక్షుడిగా కొనసాగారు. రాయలసీమకు నామకరణం చేసింది గాడిచర్ల వారే. అప్పటివరకు దత్త మండలాలుగా వ్యవహరించిన రాయలసీమకు.. 1928 నాటి నంద్యాల 'ఆంధ్ర మహాసభ'లో ఈ పేరు పెట్టారు.

పత్రికా సంపాదకుడిగా, పుస్తక రచయితగా గాడిచర్ల కృషి మరువలేనిది. ఆంధ్రపత్రిక తొలి సంపాదకుడు ఆయనే. ది నేషనలిస్ట్, మాతృసేవ, ఆంధ్రవార్త, అడల్ట్ ఎడ్యుకేషన్ రివ్యూ, కౌముది పత్రికలకూ సంపాదకత్వం వహించారు. మహిళల సమస్యలపై 'సౌందర్యవల్లి' పత్రిక నడిపారు. జీ.హెచ్.ఎస్.పేరుతో హిందూ పత్రికకు వ్యాసాలు రాశారు. ఆయన రచనలు 'శ్రీరామ చరిత్ర', 'పౌరవిద్య' పాఠ్య పుస్తకాలయ్యాయి. తెలుగుతోపాటు ఇంగ్లీష్, తమిళ, మరాఠీ, హిందీ భాషలనూ ఔపోసన పట్టిన గాడిచర్ల.. సాహితీవేత్తగా ఎన్నో కొత్త పదాలు సృష్టించారు.

ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు గాడిచర్ల. 1952 నాటి అఖిలపక్ష సదస్సుకు అధ్యక్షత వహించారు. రాష్ట్రమంతటా పర్యటిస్తూ ఉద్యమాన్ని వేడెక్కించారు. అలా జీవితాంతం దేశ సేవకే అంకితమైన గాడిచర్ల హరిసర్వోత్తమరావు... 1960 ఫిబ్రవరి 29న తుదిశ్వాస విడిచారు.

ఇదీ చదవండి : సుబ్రహ్మణ్య భారతి.. జాతీయ సమైక్యతా వారధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.