కర్నూలులో కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. నగరంలోని ఎస్టీయూ భవన్ లో సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యాలయాన్ని విశాఖకు తరలించటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. రాయలసీమలోనే కృష్ణానది యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలనేది ఇక్కడి ప్రజల ఆకాంక్షగా నాయకులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి...: 'అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి'