కర్నూలు వడ్డెగెరి కాలనీ మొత్తం రెడ్ జోన్ లో ఉన్నందున పోలీసులు అన్నీ రహదారులు బంద్ చేశారు. ఓ మహిళకు అనార్యోగం కారణంగా ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు వెళ్లగా రహదారులన్నీ ఎక్కడికక్కడ మూసి ఉన్నాయి. ఆసుపత్రికి వెళ్లేందుకు ఆలస్యం అయిన పరిస్థితుల్లో... స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
జబ్బు చేసిన వారు వైద్యులకు చూపించుకోోవాలంటే ఆంక్షల కారణంగా ఇబ్బంది అవుతోందని చెప్పారు. ముందు.. ఆ కంచెలను తొలగించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్, డీఎస్పీ బాబా ఫకృద్దిన్ పరిస్థితిని చక్కదిద్దారు. రోడ్డుకు ఉన్న కంచెను పోలీసులు తొలగించగా.. ప్రజలు ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి: