కర్నూలు జిల్లా ఆస్పరి మండల కేంద్రంలోని గ్రామీణ బ్యాంకు వద్దకు భారీగా ప్రజలు చేరుకున్నారు. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన పంటల బీమా వివరాలను తెలుసుకోవటానికి ఒక్కసారిగా వందల సంఖ్యలో ప్రజలు వచ్చారు.
బ్యాంకు అధికారులు ప్రజలకు సమాచారం ఇవ్వకపోవటంతో ఈ పరిస్థితి వచ్చిందని పలువురు విమర్శించారు. ఏ మాత్రం భౌతిక దూరం పాటించకుండా వారు అలాగే నిలుచోవడంపై.. స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న తరుణంలో.. ఇలాంటి నిర్లక్ష్యం మంచిది కాదన్నారు.
ఇదీ చదవండి:
అయ్యో పాపం: అమ్మ, చెల్లెమ్మ కోసం.. పదేళ్ల పసివాడు.. ఎంతటి కష్టం చేశాడమ్మా!