బహిరంగ విపణిలో నిన్నటి వరకు రూ. 50 పలికిన కిలో నాణ్యమైన ఉల్లి.. ఇప్పుడు రూ. 20 కూడా పలకటం లేదు. తగ్గిన ధరలతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తుండగా..రైతన్నలు మాత్రం ఆవేదనలో ఉన్నారు. తమకు కనీసం పెట్టుబడులు సైతం రావటం లేదని కన్నీరు పెట్టుకుంటున్నారు.
కర్నూలు జిల్లాలో రబీలో సుమారు 3 వేల హెక్టార్లలో ఉల్లిని సాగు చేశారు. ప్రస్తుతం దిగుబడులు క్రమంగా పెరుగుతున్నాయి. కర్నూలు ఉల్లి మార్కెట్కు 4 వందల నుంచి 5 వందల టన్నుల వరకు సరకు వస్తోంది. ఎకరం విస్తీర్ణంలో ఉల్లిని సాగు చేయటానికి సుమారు రూ. లక్ష పెట్టుబడి అవుతుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం క్వింటా ధర సరాసరిన వెయ్యి నుంచి 13 వందల రూపాయల వరకు పలుకుతోంది. దీనివల్ల తమకు నష్టాలు వస్తున్నాయని..రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొన్నటి వరకు కర్నూలు ఉల్లి మార్కెట్లో క్వింటా ధర 3 వేల నుంచి 4 వేలకు పలికింది. ఈ ధరలతో రైతన్నల కళ్లలో ఆనందం వ్యక్తమైంది. ప్రస్తుతం దేశంలోనే ఉల్లిని అధికంగా పండించే మహారాష్ట్ర నుంచి దిగుబడులు ఎక్కువగా వస్తున్నాయి. కర్నూలు జిల్లాలోనూ దిగుబడులు ప్రారంభమయ్యాయి. ఫలితంగా విపణిలో ఉల్లిగడ్డలు సరిపడా ఉండటంతో..ధరలు దిగి వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
మహారాష్ట్ర సహా గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఉల్లి దిగుబడులు అధికంగా వస్తే..కర్నూలు మార్కెట్లో ధరలు మరింత క్షీణించే అవకాశం లేకపోలేదు.
ఇదీచదవండి