ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా నంద్యాలలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సును నిర్వహించారు. స్థానిక పురపాలక సంఘం కార్యాలయ సమావేశ భవనంలో నిర్వహించిన ఈ సదస్సుకు కమిషనర్ వెంకట కృష్ణ, పట్టణ సీఆర్పీలు హజరయ్యారు. పొదుపు సంఘాల మహిళలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేదిద్దాం- పర్యావరణాన్ని కాపాడుదాం అని ఆయన సూచించారు. నవంబర్ 15వ తేదీ తరువాత ఎవరైనా ప్లాస్టిక్‌ని వాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చూడండ:
'కర్నూలులో ఉల్లాసంగా రెడ్డి సామాజిక వర్గ వనభోజన కార్యక్రమం'