కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘానికి జరిగిన ఎన్నికల్లో వైకాపా విజయం సాధించింది. పురపాలకంలోని మొత్తం 42 వార్డులకు.. 12 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 30 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో వైకాపా 25, తెదేపా4, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు. 12 ఏకగ్రీవాలతో కలిపి 37 వార్డుల్లో వైకాపా అభ్యర్థులు గెలుపొందారు. ఫలితంగా నంద్యాల పురపాలక సంఘం పీఠాన్ని వైకాపా కైవసం చేసుకుంది.
ఇదీ చూడండి: ఎన్నికల ఫలితాలు: మున్సిపోల్స్‌లో ఫ్యాన్ గాలి