ETV Bharat / state

కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

కర్నూలు జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నందికొట్కూరు, మిడుతూరు, పగిడ్యాల, జూపాడు బంగ్లా, పాములపాడు, కొత్తపల్లి మండలంలో జరిగిన ఎన్నికల్లో 66.65 శాతం పోలీంగ్ నమోదైంది.

నందికొట్కూరు మండలంలో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తున్న దృశ్యం

author img

By

Published : Apr 9, 2021, 7:12 AM IST

కర్నూలు జిల్లాలో చెదురుముదురు ఘటనలు మినహా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 60.28 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. దేవనకొండ మండలంలోని నాలుగు గ్రామాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నారు. కే వెంకటాపురం గ్రామంలో రిగ్గింగ్ ను అడ్డుకున్న తెదేపా ఏజెంట్ వెంకటేష్ పై వైకాపా నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నేల తలమర్రి గ్రామంలోనూ... దొంగఓట్లకు అడ్డుతగిలిన తెదేపా కార్యకర్త చంద్రపై వైకాపా నాయకులు దాడి చేశారు.బేతపల్లిలో... పోలింగ్ కేంద్రానికి ఓటర్లను రానీయకుండా... వైకాపా నాయకులు అడ్డుకోవటం ఉద్రిక్తలకు దారి తీసింది. కప్పట్రాళ్ల గ్రామంలో... బాగా మద్యం సేవించిన రెండు వర్గాలు... పరస్పరం దాడులు చేసుకున్నారు.

నందికొట్కూరు నియోజకవర్గంలో...

కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు, మిడుతూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, పాములపాడు, కొత్తపల్లి మండలంలో జరిగిన ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల్లో 66.65 శాతం పోలింగ్ జరిగింది నందికొట్కూరు పగిడ్యాల పాములపాడు మండలాలకు చెందిన బ్యాలెట్ బాక్సులను నందికొట్కూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భద్రపరిచారు. మిడుతూరు ,జూపాడు బంగ్లా మండలాని సంబంధించిన బాక్సులను కర్నూలులోని సెయింట్ జోసెఫ్ కళాశాలకు తరలించారు. కొత్తపల్లి మండలానికి చెందిన ఆత్మకూరు పట్టణంలోని జూనియర్ కళాశాల లో భద్రపరిచారు.

ఆదోని మండంలో

ఆదోని మండలంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.మండలంలో చాలా గ్రామాల్లో ఓటర్లు ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.పోలింగ్ మందకొడిగా సాగింది.సాంబగల్ గ్రామంలో 102 ఏళ్ళ వృద్దురాలు బజారమ్మ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆరేకల్లు గ్రామంలో ఓటర్లు బారులు తీరారు.మండలం ఎంపీటీసీ ఎన్నికలకు 58.34 శాతం, జడ్పీటీసీ ఎన్నికలకు 55.72 శాతం పోలింగ్ నమోదైంది.

ఇదీ చదవండి: మాజీ మంత్రి అఖిలప్రియను అడ్డుకున్న పోలీసులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.