ETV Bharat / state

కల్తీ మద్యం కేసులో ఎమ్మెల్యే అనుచరుడి అరెస్ట్

కర్నూలు జిల్లాలో అక్రమ మద్యం తయారుచేస్తోన్న ముఠాను ఎక్సైజ్​ అధికారులు అరెస్టు చేశారు. కర్ణాటక నుంచి స్పిరిట్ తెప్పించుకుని మద్యం తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుల్లో ఓ ఎమ్మెల్యే అనుచరుడు, వీఆర్వో ఉన్నారు.

author img

By

Published : Dec 10, 2019, 7:38 PM IST

MLA follower arrest in adulterated liquor case
కల్తీ మద్యం
కల్తీ మద్యం ముఠా అరెస్ట్

కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం అమకతాడు గ్రామంలో ఈ నెల 7న కల్తీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనుచరుడు, కృష్ణగిరి మండల వైకాపా నాయకుడు బ్రహ్మానంద రెడ్డిని ఎక్సైజ్ అధికారులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపారు. అతనిచ్చిన సమాచారంతో జిల్లాలోని కృష్ణానగర్​లో కల్తీ మద్యం తయారీ కేంద్రంపై డోన్​ ఎక్సైజ్ పోలీసులు, ఎన్​ఫోర్స్​మెంట్, టాస్క్​ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మద్యం తయారీ కేంద్ర నిర్వాహకుడు వీఆర్వో విష్ణువర్దన్​ రెడ్డితో పాటు కృష్ణమూర్తి, భాస్కర్​లను అదుపులోకి తీసుకున్నారు. వీరు కర్ణాటక నుంచి స్పిరిట్ తెప్పించుకుని కృష్ణానగర్​లోని ఓ ఇంట్లో కల్తీ మద్యం తయారుచేస్తున్నారని ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్​ చెన్నకేశవులు వెల్లడించారు. దీనిని గ్రామాల్లో విక్రయిస్తున్నారని తెలిపారు. కల్తీ మద్యంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు దాడి చేసి నిందితులను పట్టుకున్నామని వివరించారు. వీరికి స్పిరిట్​ సరఫరా చేసే వ్యక్తి కర్ణాటకలో ఉన్నాడని.. అతని అరెస్టుకు రంగం సిద్ధం చేశామని డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు. గ్రామాల్లో ఎవరైనా కల్తీ మద్యం తయారుచేసినా.. అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

టిక్​టాక్​ వల్ల రగడ... నలుగురిపై కాల్పులు

Intro:ap_knl_51_10_nindhulu_arrest_ab_AP10055

s.sudhakar, dhone.

కర్నూల్ జిల్లా కృష్ణగిరి మండలం అమకతాడు గ్రామంలో ఈ నెల 7 వ తారీకున దొరికిన కల్తీ మద్యం కేసులో పత్తికొండ m.l.a కంగాటి శ్రీదేవి అనుచరుడు, కృష్ణగిరి మండల వై.కా.పా నాయకుడు బ్రహ్మానంద రెడ్డి ని ఎక్సైజ్ అధికారులు నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. కర్నూల్ లో కృష్ణా నగర్ లో కల్తీ మద్యం తయారీ కేంద్రం లో v.r.o విష్ణువర్ధన్ రెడ్డి, మరో ఇద్దరు వక్తులు కృష్ణమూర్తి, భాస్కర్ ను నేడు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక నుండి స్పిరిట్ తెచ్చి కృష్ణా నగర్ లో ఓ ఇంట్లో కల్తీ కలుపుతున్నారు. ఇక్కడ తయారుచేసి గ్రామాలలో విక్రయిస్తారు. ఈ కల్తీ మందు తాగి వాంతులు, విరేచనాలు అయిన వక్తులు ఫిర్యాదు చేయడంతో డిప్యూటీ కమీషనర్ ఆదేశాల మేరకు దాడులు చేసి పట్టుకున్నారు. వీరికి స్పిరిట్ చేసే వక్తి కర్నాటక లో ఉన్నాడు. ఇతని అరెస్ట్ కోసం రంగం సిద్ధం చేశామని డిప్యూటీ కమిషనర్ చెన్న కేశవులు పేర్కొన్నారు. ఇలాంటి కల్తీ మద్యం ఎవరైనా అమ్మిన పోలీస్ లకు, మాకు గాని సమాచారం ఇవ్వాలని చెన్న కేశవులు తెలిపారు.

బైట్.

చెన్న కేశవులు,
డిప్యూటీ కమిషనర్.

Body:కల్తీ మద్యం కేసులో నిందితులు అరెస్ట్

Conclusion:kit no.692, cell no.9394450169
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.