ETV Bharat / state

MINISTER BUGGANA : వైకాపా నేతలు మా భూములు లాక్కుంటున్నారు.. మంత్రి ఎదుట రైతుల ఆవేదన

Minister Buggana : మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​కు నిరసన సెగ తగిలింది. కర్నూలు జిల్లా డోన్​లో మంత్రి కారును అడ్డుకున్న దొరపల్లె గ్రామస్థులు.. పురుగుమందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు. వారి ఆందోళనపై స్పందించిన మంత్రి.. స్థానిక ఎస్సైతో మాట్లాడి సమస్యను పరిష్కారించాలని సూచించారు.

మంత్రికి నిరసన సెగ
మంత్రికి నిరసన సెగ
author img

By

Published : Dec 13, 2021, 2:39 PM IST

Updated : Dec 13, 2021, 6:41 PM IST

మంత్రికి నిరసన సెగ.. పురుగుమందు డబ్బాలతో బాధితుల ఆందోళన

Minister Buggana Rajendranath : కర్నూలు జిల్లా డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సీజన్ ప్లాంటును ప్రారంభించి వెళ్తున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కాన్వాయ్​ని దొరపల్లి గ్రామానికి చెందిన కొందరు రైతులు అడ్డుకున్నారు. తమ పొలాలను లాక్కునేందుకు పలువురు వైకాపా నేతలు యత్నిస్తున్నారని.. మాకు న్యాయం చేయాలని మంత్రిని వేడుకున్నారు.

డోన్ మార్కెట్ యార్డు ఛైర్మన్ రామచంద్రుడు, దొరపల్లెకి చెందిన వైకాపా నేత చిరంజీవి, డోన్ ఎంపీపీ రాజశేఖర్​.. తమ పొలాలను కాజేసేందుకు యత్నిస్తున్నారని బాధిత రైతులు నాగేంద్ర, నారాయణ.. మంత్రికి వివరించారు. తమను పలుమార్లు భయాందోళనకు గురిచేశారని, పొలాల విషయం మాట్లాడితే కేసులు పెడతామని భయపెడుతున్నారని, తమకు న్యాయం చేయాలని మంత్రిని వేడుకున్నారు.

లేదంటే.. తాము పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తంచేశారు. స్పందించిన మంత్రి.. వెంటనే రూరల్ ఎస్సైతో మాట్లాడి వాళ్ల సమస్య పరిష్కరించాలని సూచించారు.

ఇదీచదవండి.

Last Updated : Dec 13, 2021, 6:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.