ETV Bharat / state

వైకాపా నాయకులు దాడి చేశారంటూ కానిస్టేబుల్​ ఆరోపణ - బ్రాహ్మణ కొట్కూర్ పోలీస్ స్టేషన్ తాజా వార్తలు

తెదేపా-వైకాపా నాయకుల మధ్య తగాదాను ఆపేందుకు ప్రయత్నించగా తనపై వైకాపా నాయకులు దాడి చేసి గాయపరిచారని.. బ్రాహ్మణ కొట్కూర్ పోలీస్ స్టేషన్​లో పనిచేస్తున్న కానిస్టేబుల్​ రఘు ఆరోపించాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా బ్రాహ్మణ కొట్కూర్​ మండలం కోళబావాపురంలో జరిగింది. వైకాపా నాయకులు దాడిలో తన చెయ్యి విరిగినట్లు సదరు కానిస్టేబుల్​ తెలిపాడు.

attack on constable
కానిస్టేబుల్​పై దాడి
author img

By

Published : Apr 28, 2021, 9:53 AM IST

కర్నూలు జిల్లా బ్రాహ్మణ కొట్కూర్ పోలీస్ స్టేషన్​లో పని చేస్తున్న కానిస్టేబుల్ రఘుపై వైకాపా నాయకులు దాడి చేసి గాయపరిచారు. బ్రాహ్మణ కొట్కూరు స్టేషన్ పరిధిలోని కోళ్లబావాపురం గ్రామంలో మంగళవారం ఎల్లమ్మ ఉత్సవం జరిగింది. ఉత్సవ అనంతరం ఏర్పాటు చేసిన విందుకు వివిధ గ్రామాల నుంచి వైకాపా, తెదేపా నాయకులు వెళ్లారు. విందు అనంతరం చిన్న తగాదా కారణంగా ఇరు పార్టీల నాయకుల మధ్య గొడవకు దిగారు. తెదేపా వర్గాన్ని దూరంగా వెళ్లాలని కానిస్టేబుల్ సూచించడంతో వారు కొంత దూరం వెళ్లిపోయారు. ఈ పరిస్థితిని గమనించి అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రఘు ఎస్సైకి సమాచారం అందించాడు. ఆ తర్వాత వైకాపా నాయకులకు వెళ్లాలని సూచించడంతో వారు కానిస్టేబుల్​పై తిరగబడి చేయి చేసుకున్నారని కానిస్టేబులు తెలిపాడు.

అప్పుడే అక్కడికి చేరుకున్న ఎస్సై చంద్రబాబు, మిగతా సిబ్బంది కానిస్టేబుల్​ రఘును జీపులో ఎక్కించుకుని ఆసుపత్రికి తరలించారు. రెండు వర్గాలను పోలీసులు అక్కడినుంచి చెదరగొట్టారు. ఈ దాడిలో చెయ్యి విరిగిందని కానిస్టేబుల్ ఆరోపించాడు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్​పై చేయి చేసుకున్న వైకాపా నాయకులపై కేసు నమోదు చేసి.. అతనికి న్యాయం చేయాలని ప్రజా సంఘాల నాయకులు, పోలీసులు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

ఆక్సిజన్ నిల్వలు పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు !

బోరు బావిలో పడ్డ మూడేళ్ల బాలుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.