ETV Bharat / state

96 బాక్సుల మద్యం స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులపై కేసు - adhoni crime news

కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి కంకర ట్రాక్టర్‌లో తరలిస్తున్న 96 బాక్సుల మద్యాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ రమేశ్​ రెడ్డి తెలిపారు.

liqour illigal transport in tractor at karnool district
టెట్రాప్యాకెట్లలో మద్యం తరలింపు
author img

By

Published : Mar 6, 2021, 11:07 AM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు భారీగా మద్యం పట్టుకున్నారు. కర్ణాటక నుంచి కంకర ట్రాక్టర్‌లో తరలిస్తున్న 96 బాక్సుల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో.. కర్ణాటక - ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదోని మండలం గజ్జెహళ్లి క్రాస్ దగ్గర ట్రాక్టర్లో ఎటువంటి అనుమానం రాకుండా కంకర రాళ్ల మధ్యలో మద్యాన్ని దాచి పెట్టారు.

పోలీసులు అనుమానం వచ్చి ట్రాక్టర్​ను సోదా చేయగా.. 96 బాక్సుల్లో 9216 టెట్రా ప్యాకెట్లలో మద్యం తరలించడాన్ని గుర్తించారు. వీటి విలువ 3 లక్షల 27 వేల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు గోనెగండ్ల మండలానికి చెందిన వారని ఎక్సైజ్ సీఐ రమేశ్​ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:

మున్నిపల్ ఎన్నికల్లో తెదేపా గెలుపుపై ఎంపీ కేశినేని నాని ధీమా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.