ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని వామపక్ష పార్టీల నాయకులు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేసే కుట్రలను మానుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కర్నూలు నగరంలోని కార్మిక కర్షక భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.
విభజన హామీలను సైతం పరిగణలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందరో బలిదానాల ఫలితంగా ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పారు. అవసరమైతే ప్రాణత్యాగాలు చేయడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఈ నెల 9న అన్ని రాజకీయ పార్టీలతో కలిసి కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామన్నారు.
ఇదీ చూడండి: