తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా... కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప దివ్యాంగులకు ప్రత్యేకంగా పుష్కర పూజలు చేయించారు. నగరంలోని సంకల్ బాగ్ పుష్కర ఘాట్లో అమ్మ అంధుల పాఠశాలకు చెందిన 30 మందికి... సంప్రదాయబద్దంగా, శాస్త్రోక్తంగా పూజారులతో పుష్కర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఘాట్లో ఉన్న యాగశాలలో హోమం చుట్టూ ప్రదక్షిణ చేయించి వేదపండితులతో ఆశీర్వచనం చేయించారు.
ఇదీ చదవండి: