Lawers Protest for Judicial Academy: కర్నూలు హైకోర్టు విషయంలో ప్రభుత్వం మోసం చేస్తుందని కర్నూలు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యుడీషియల్ అకాడమీ కోసం విడుదల చేసిన 152 జీవోను ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందని న్యాయవాదులు ప్రశ్నించారు. కర్నూలులో ఈనెల 5న సీమ గర్జన నిర్వహించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రాయలసీమ ద్రోహి అని విమర్శలు చేసినవారు ఇప్పుడెక్కడ ఉన్నారో తెలియదని అన్నారు. కర్నూలు జిల్లాకు వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం చెయ్యలేదని.. గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకే ప్రయత్నిస్తున్నారని వారు తెలిపారు. కర్నూలుకు ప్రకటించిన జ్యుడీషియల్ అకాడమీని కర్నూలులోనే ఏర్పాటు చేయాలని వారు కోరారు.
కర్నూలుకు హైకోర్టు ఇస్తానని చెప్పారు. కనీసం రాజధాని కూడా ఇవ్వలేదు.. సెక్రటరీ పెట్టలేదు. మళ్లీ జ్యుడీషియల్ అకాడమీ అన్నారు.. అది కూడా మంగళగిరికి వెళ్లిపోయింది. ప్రజలందరినీ మభ్యపెట్టి చివరికి సుప్రీంకోర్టులో ఏపీ తరఫున వాదించే వేణుగోపాల్ కర్నూలుకు హైకోర్టు లేదు ఏం లేదు అని చెప్పారు. కర్నూలు, రాయలసీమ ప్రజలను ఈ ప్రభుత్వం మోసం చేస్తోంది.. సీమ గర్జన జరిగినప్పుడు రాకపోతే వారంతా రాయలసీమకు ద్రోహులన్నారు. ఈ రోజు కర్నూలుకు హైకోర్టు, జ్యుడీషియల్ అకాడమీ లేదని చెప్పినవారు ఏ ద్రోహులో ఆలోచించుకోవాలి. కర్నూలుకు జ్యుడీషియల్ అకాడమీ కావాలని మేము పోరాటం చేస్తాం. -కృష్ణుడు, న్యాయవాది
ఇవీ చదవండి: