కర్నూలు జిల్లా డోన్ మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల్లో తెదేపా తరఫున ఏడుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత కేఈ ప్రభాకర్ తెలిపారు. బీ ఫారాలను ఎన్నికల అధికారులకు అందజేసినట్లు చెప్పారు. అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని గుర్తు చేశారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. తాము పోటీలో ఉన్నట్లు అభ్యర్థులు తెలిపారు.
ఇదీ చదవండి: 'నా నలభై ఏళ్ల రాజకీయంలో ఇలాంటి ఎన్నికలు చూడలేదు'