కర్నూలులోని తుంగభద్ర పుష్కర ఘాట్లను తెదేపా నేతలు కాల్వ శ్రీనివాసులు, ప్రభాకర్ చౌదరి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు సందర్శించారు. హిందూ సంస్కృతి సంప్రదాయాలను పాటించడం లేదని వారు ఆరోపించారు. పాత ఘాట్లకు రంగులు వేయడం మినహా ప్రభుత్వం ఏమీ చేయలేదని కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు.
స్నానం చేస్తున్నవారిని లాక్కెళ్లి... అరెస్టు చేసిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానికే చెందుతుందని ఎద్దేవా చేశారు. తుంగభద్ర నదిలో మురుగు నీరు కలుస్తున్నా పట్టించుకోవటం లేదని... ఇప్పటికైనా నదిని కలుషితం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: