వైద్యులపై దాడి చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిరసన తెలిపారు. విశాఖ కేజీహెచ్‌లో జూనియర్ డాక్టర్‌పై దాడిని ఖండించారు.
కొవిడ్ విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న తమపై దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వాళ్లను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ నాయకుడు డా. ప్రణీత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: