ETV Bharat / state

'పంట నమోదు చేసుకుంటే బీమా వస్తుంది' - కర్నూలు జిల్లా పంట నష్టం వార్తలు

గత కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాలకు కర్నూలు జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. 25 వేల హెక్టార్లలో మొక్కజొన్న, వరి, పత్తి సహా ఇతర పంటలు దెబ్బతిన్నాయని స్పష్టం చేశారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కువగా పంటలు నీట మునిగాయి. ఇప్పటికే జిల్లాలో పర్యటించి పంటనష్టం అంచనాలు ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్తున్న వ్యవసాయ శాఖ జేడీ ఉమామహేశ్వరమ్మతో ఈటీవీ భారత్ ముఖాముఖి...

interview with kurnool district agricultural jd uma maheswaramma
ఉమామహేశ్వరమ్మ, వ్యవసాయ శాఖ జేడీ
author img

By

Published : Sep 23, 2020, 8:45 PM IST

ప్రశ్న: కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది?

జవాబు: కర్నూలు జిల్లాలో ఖరీఫ్‌లో సాధారణ సాగు 6 లక్షల 23 వేల హెక్టార్లకు గాను ఇప్పటి వరకు 5 లక్షల 59 వేల హెక్టార్లు వివిధ పంటలు సాగు చేయడమైంది. పత్తి 2 లక్షల 54 వేల హెక్టార్లు, మొక్కజొన్న 36 వేల హెక్టార్లు, కంది 61 వేల హెక్టార్లు, వేరు శనగ 82 వేల హెక్టార్లు, మిరప, ఉల్లి 16 వేల హెక్టార్లు సాగు చేశారు. జూన్, జులై నెలల్లో కురిసిన వర్షాలకు కొంత వరకు పంట నష్టం జరిగింది. ప్రభుత్వానికి పంట నష్టంపై అంచనా వేసి రిపోర్టు పంపించాం. సెప్టెంబర్ నెలలో గత వారం నుంచి ఎక్కువ వర్షం పడటం వల్ల చెరువులు నిండి, వాగులు కోతకు గురవ్వటంతో పంట నష్టం ఎక్కుగా జరిగింది. ఇప్పటి వరకు ప్రాథమిక సర్వే ప్రకారం జిల్లాలో 25 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని కమిషనర్‌కు రిపోర్టు చేశాం. మొక్కజొన్న 11 వేల హెక్టార్లు, వరి 8 వేల హెక్టార్లు, పత్తి సుమారు 5 వేల హెక్టార్లు వీటితో పాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయి.

ప్రశ్న : ఏఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏఏ ప్రాంతాల్లో పంట నష్టం ఎక్కువగా జరిగింది?

జవాబు : ఆత్మకూరు సబ్‌ డివిజన్‌ ప్రాంతంలోని పాములపాడు, కొత్తపల్లి, వెలుగోడు, ఆత్మకూరు మండలాలు ఉన్నాయి. వాగు నీరు, చెరువులు తెగడం వల్ల పాములపాడు, కొత్తపల్లి మండలాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించాం. నంద్యాల ఆగ్రికల్చర్ సబ్ డివిజన్‌లో బండిఆత్మకూరు ప్రాంతంలో కుందూ నది వల్ల పంట నష్టం జరిగినట్లు గుర్తించాం. పాణ్యం ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో, నంద్యాల మండలంలో కుందూ నదితో కొంత పంట నష్టం జరిగింది.

ప్రశ్న: జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది. ?

జవాబు : పశ్చిమ ప్రాంతంలో సెప్టెంబర్ వర్షాలకు హోళగుందలో తుంగభద్ర నది ప్రవాహంతో పంట నష్టం రిపోర్టు చేశాం. మిగతా మండలాల్లో పంట నష్టం జరగలేదు.

ప్రశ్న: ప్రాథమిక అంచనా ప్రకారం ఎంత నష్టం జరిగింది ?

జవాబు: సర్వే నెంబర్ల వారీగా అంచనా వేస్తున్నాము. వరి తప్ప మిగతా పంటలన్నీ జిల్లాలో 100 శాతం ఈ పంట నమోదు చేశాం. వరి 71 వేల హెక్టార్లకు గాను 69 వేల హెక్టార్లు వేసినట్టు వచ్చింది. అన్ని పంట కాల్వల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో ఈ సంవత్సరం జిల్లాలో వరి సాగు పెరిగే అవకాశం ఉంది. ప్రాథమిక అంచనా ప్రకారం కోట్లలోనే నష్టం రావచ్చని అనుకుంటున్నాం. అంచనా పూర్తయిన తరువాత సరైన నష్టం తెలుస్తుంది.

ప్రశ్న : కొన్నిచోట్ల పంట చేతికందే సమయంలో వర్షాలతో నష్టపోయినట్లుంది ?

జవాబు : ఆత్మకూరు ప్రాంతంలో జూన్‌, జులైలో మొక్కజొన్న నష్టం జరిగింది. ఆగస్టులో కూడా పంట నష్టం జరిగింది. తరచుగా పంట దెబ్బతినటంతో ఇప్పుడు వర్షాలకు మొక్కజొన్న కాండం కుళ్లిపోతోంది. పొలాల్లో నీరు నిల్వ ఉంటోంది. శాస్త్రవేత్తలకు మొక్కజొన్న పొలాలు చూపించడం జరిగింది. గింజ లేకుండా కుళ్లిపోవడం జరుగుతోంది.

ప్రశ్న: వర్షాలు, వరదలు కొనసాగే అవకాశముంది. ఎలాంటి చర్యలు తీసుకుంటే పంటలు కొద్దిగానైనా కాపాడుకునే అవకాశముంది ?

జవాబు : మొక్కజొన్నలో ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు. పత్తి, మిరప చేలల్లో నీరు నిల్వ ఉంటే తీసివేయాలి. పత్తి చేలో నీరు తీసివేసిన తరువాత 2 గ్రాముల యూరియాను లీటరు నీటిలో వేసి పిచికారి చేసుకోవాలి. పత్తి, మిరప సాళ్లలో రోజుల తరబడి నీరు నిల్వ ఉంటే రూట్ రాట్, విల్ట్ వచ్చే ప్రమాదముంది. కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి వేళ్ల దగ్గర మొదళ్లు తడిచే విధంగా సాళ్లలో పోయాలి.

ప్రశ్న : వర్షాల వల్ల కలుపు, తెగుళ్ల నుంచి పంటను ఏలా కాపాడుకోవాలి ?

జవాబు : ఆత్మకూరు సబ్ డివిజ్‌లో ఎడతెరిపిలేని వర్షాలతో కలుపు సమస్య ఉంది. మొక్కజొన్నలో కలుపు తీయలేని పరిస్థితి. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ రిసోర్స్‌ సెంటర్​లోని కేవీకే శాస్త్రవేత్తలు, ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు, సిబ్బంది అందరం కలిసి సమస్యను గుర్తించడానికి పర్యటనలు చేస్తున్నాం. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రం స్థాయిలో పనిచేసే వీఏఏలకు వెబ్‌ ఎక్స్‌ ద్వారా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో తెలియచేస్తున్నాం.

ప్రశ్న : వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఏం చెప్తారు?

జవాబు : పంట నమోదు చేయని రైతులు ఎవరన్నా ఉంటే రైతు భరోసా కేంద్రాల్లో వీఏఏల ద్వారా పంట నమోదు చేసుకోవాలని కోరుతున్నాం. పంట నమోదు ద్వారానే బీమా ఇవ్వడం జరుగుతుంది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో మొక్కజొన్న పంట ఉంది. పంట నష్టం జరిగితే బీమా వచ్చే అవకాశముంటుంది.

ఇవీ చదవండి..

'దాడులపై సీఎం ఎందుకు స్పందించడం లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.