కర్నూలు సరిహద్దుల్లోని పంచలింగాల చెక్ పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఎస్ఈబీ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. వడ్డె రామకృష్ణ అనే వ్యక్తికి చెందిన ఆటోలో సీట్ల మధ్య ఉంచి రవాణా చేస్తున్న సరుకును గుర్తించారు. 218 మద్యం సీసాలతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ లక్ష్మీ దుర్గయ్య తెలిపారు.
ఇదీ చదవండి: