పోలీసులు ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం మంత్రి సుచరిత చెప్పారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో సీఐ ,హెడ్ కానిస్టేబుల్లను అరెస్ట్ చేశామని వివరించారు. చీరాల కిరణ్, సీతానగరం శిరోముండనం ఘటనల్లో సైతం తప్పుచేసిన అధికారులపై చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. కిందిస్థాయి పోలీసులతో ఎవరైనా వేధింపులకు గురైతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు ప్రతి జిల్లాలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామన్నారు. ఏపీ పోలీసు సేవ యాప్ ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష అని, ఆ దిశగా పనిచేయాలని పోలీసులకు సూచించారు. తప్పుచేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మృతుని కుటుంబంపై ఆధారపడిన వృద్ధురాలికి రూ. 25 లక్షల నష్టపరిహారం సీఎం ప్రకటించారని పేర్కొన్నారు.
అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకునేలా పోలీసులు ప్రవర్తించినట్లు రుజువైనందున సీఐ, హెడ్ కానిస్టేబుల్ వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని డీజీపి గౌతమ్ సవాంగ్ తెలిపారు. వారికి బెయిల్ రావడం కోర్టుకు సంబందించిన అంశమన్నారు. దర్యాప్తులో భాగంగా వేధింపులకు గురిచేస్తే తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని వివరించారు.
సంబంధిత కథనాలు:
'సీఐ, హెడ్ కానిస్టేబుల్ బెయిల్‌పై అప్పీల్‌కు వెళ్తాం'
'అబ్దుల్ కుటుంబం ఆత్మహత్య కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలి'
సలాం కుటుంబానిది ప్రభుత్వ హత్యే: అచ్చెన్నాయుడు
ఆటో డ్రైవర్ కుటుంబం ఆత్మహత్య కేసు: సీఐ, హెడ్ కానిస్టేబుల్‌కు బెయిల్