ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేయడంతో కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని కుందు నదిలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం 20 వేల క్యూసెక్కుల నీరు ఉంది. పట్టణంలోని హారిజనపేట సమీపంలో మద్దిలేరు వాగులో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో వంతెన పైకి నీళ్లు చేరాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నంద్యాల తహసీల్దార్ రవికుమార్ అన్నారు.
ఇవీ చదవండి..