ETV Bharat / state

ACCIDENT: ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి దుర్మరణం - Former MLA Neeraja Reddy

Former MLA Neeraja Reddy passed away: కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి ఆమె కర్నూలు వస్తుండగా.. ప్రయాణిస్తున్న కారు టైర్ పేలి వాహనం బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఆమె కర్నూలు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ నీరజారెడ్డి కన్నుమూశారు.

ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి
ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి
author img

By

Published : Apr 16, 2023, 6:07 PM IST

Updated : Apr 17, 2023, 6:30 AM IST

Former MLA Neeraja Reddy passed away: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత పాటిల్‌ నీరజా రెడ్డి(50) మృతి చెందారు. దీంతో కర్నూలులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కర్నూలు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా బీచుపల్లి వద్ద కారు టైర్‌ పేలిపోవడంతో ఫార్చునర్‌ కారు పల్టీ కొట్టి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే కర్నూలు ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రమాదంలో నీరజా రెడ్డి తల, ఇతర శరీర భాగాలకు తీవ్రగాయాలైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదం ధాటికి వాహనం నుజ్జునుజ్జైంది. నీరజా రెడ్డికి ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంటున్నారు. నీరజా రెడ్డి భర్త శేషిరెడ్డి గతంలో పత్తికొండ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఫ్యాక్షన్‌ గొడవల్లో దారుణ హత్యకు గురయ్యారు. దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో నీరజా రెడ్డి రాజకీయాల్లో వచ్చారు. ఇప్పుడు ఆమె కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆలూరు నియోజకవర్గాలలో విషాదం ఛాయలు అలుముకున్నాయి.

ప్రస్తుతం ఆలూరు బీజేపీ ఇన్​ఛార్జ్​గా.. నీరజా రెడ్డి 2009 నుంచి 2014 వరకు ఆలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతకుముందు పత్తికొండ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా దేవరకొండ మండలం ఆలూరు నియోజకవర్గంలో చేరడంతో 2009లో ఆలూరులో కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచారు. పీఆర్పీ అభ్యర్థిపై 5వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2011లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ వీడి కొంత కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2019లో వైఎస్ జగన్‌ పార్టీ అయిన వైఎస్సార్‌ కాంగ్రెస్​ పార్టీలో చేరారు. అక్కడ ఇమడలేక అధికార పార్టీని వీడి బీజేపీలో చేరారు. ప్రస్తుతం నీరజా రెడ్డి ఆలూరు బీజేపీ ఇన్​ఛార్జ్​గా ఉండి పార్టీకి సేవలు అందిస్తున్నారు.

బీజేపీ నాయకులు దిగ్భ్రాంతి.. బీజేపీ ఇన్​ఛార్జ్​గా ఉండి పార్టీకి సేవలు నీరజా రెడ్డి మరణ వార్త విని బీజేపీ నాయకులు.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 17, 2023, 6:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.