కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అగ్నిమాపక రీజినల్ అధికారి, అగ్నిమాపక అధికారి పరస్పరం కొట్టుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అగ్నిమాపక అధికారిపై కేసు నమోదవటంతో అతన్ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
తుంగభద్ర పుష్కరాల సందర్భంగా గురువారం రీజినల్ అగ్నిమాపక అధికారి స్వామి, కోడుమూరు అగ్నిమాపక కేంద్రం అధికారి వెంకటరమణతో పాటు ఇతర అధికారులు పుష్కర ఘాట్లు పరిశీలించి ఎమ్మిగనూరు చేరుకున్నారు. పుష్కర ఘాట్ వద్ద కోడుమూరు అగ్నిమాపక అధికారిపై రీజినల్ అధికారి కోప్పడి దూషించినట్లు సమాచారం. వాదన ముదిరి ఘర్షణ పడి పరస్పరం కొట్టుకున్నారు. కోడుమూరు అగ్నిమాపక అధికారిపై రీజినల్ అగ్నిమాపక అధికారి ఫిర్యాదు చేయటంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారులు కోడుమూరు అగ్నిమాపక అధికారిని సస్పెండ్ చేశారు.
ఇవీ చదవండి...
'టిడ్కో ఇళ్లపై రేపటిలోగా తేల్చండి.. లేకపోతే మేమే తీసుకుంటాం'