కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో జూపాడుబంగ్లా గ్రామంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం కారణంగా దోమలు పెరుగుతున్నాయి. ఎస్సీ కాలనీలో వారంరోజుల్లోనే 30 మంది జ్వరం బారినపడ్డారు. కాలనీలో మురుగు కాలువలు అపరిశుభ్రంగా ఉన్నాయి. మంచినీటి పైపులైన్లు మురుగు కాలువల్లో ఉన్నా... చెత్తచెదారం పేరుకుపోయినా... అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన మాత్రలతో జ్వరం తగ్గడంలేదని... ప్రైవేట్ వైద్యులను ఆశ్రయిస్తున్నామని బాధితులు చెబుతున్నారు.
ఇవీ చూడండి..అప్పు తీర్చలేదని మహిళ నిర్బంధం