కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రైతులు రోడ్డెక్కారు. మార్కెట్కు తీసుకొచ్చిన శనగ, కంది పంటలను కొనుగోలు చేయటం లేదని, అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. మార్కెట్ యార్డు కార్యాలయం ఎదురుగా, జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచి ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. అనంతరం మార్కెట్ కార్యాలయానికి చేరుకొని అధికారులను నిలదీశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ రైతులు నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: కమీషన్ ఏజెంట్లకు కోటిన్నర కుచ్చుటోపీ పెట్టిన వ్యాపారి