శ్రీశైల మహాక్షేత్రంలో ఇకనుంచి ఆర్జిత సేవల టిక్కెట్లు పొందాలనుకుంటే.. తప్పనిసరిగా భక్తులు ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుందని దేవస్థానం ఈవో యస్. లవన్న తెలిపారు. దళారుల వ్యవస్థకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
భక్తులు తమకు కావాల్సిన ఆర్జిత సేవలను సవ్యంగా చేసుకొని శ్రీస్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అభిషేకం, కుంకుమార్చన, హోమాలు, విరామ దర్శనం టికెట్లు ఆధార్ కార్డులను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది అన్నారు.
ఇదీ చదవండి: