ETV Bharat / state

ఇలకైలాసాన్ని తలపిస్తున్న నవరాత్రుల సందడి

author img

By

Published : Oct 1, 2019, 5:57 AM IST

రాష్ట్రవ్యాప్తంగా దసరా మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఊరువాడ అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోతున్నాయి.

ఇలకైలాసాన్ని తలపిస్తున్న నవరాత్రుల సందడి

కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో.... నవరాత్రుల సందడి ఇలకైలాసాన్ని తలపిస్తోంది. భక్తులకు శ్రీ భ్రమరాంబ దేవి బ్రహ్మచారిని అవతారంలో దర్శనమిచ్చారు. మహానందిలో శ్రీ కామేశ్వరి దేవికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాలలో అమ్మవారి ఆలయాల్లో దసరా శోభ సంతరించుకుంది. అదోనిలో వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో... ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీపాల కోలాటం భక్తులను ఆకట్టుకుంది. ఎమ్మిగనూరులో శ్రీకన్యకాపరమేశ్వరి ఆలయంలో... అమ్మవారు శ్రీఅన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. అనంతపురం, కడప జిల్లాల్లోనూ.... ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ప్రకాశం జిల్లావ్యాప్తంగా.. అమ్మవారి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుంటూరు జిల్లా పెదకాకానిలోని భ్రమరాంభ, మళ్లిఖార్జున స్వామి ఆలయానికి.... భక్తులు పోటెత్తారు. అమ్మవారి మూలవిరాట్​ను రోజుకో రూపంలో అలంకరిస్తున్నారు.

ఇదీ చదవండి:రాష్ట్ర వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.