కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీలో కుళాయి కనెక్షన్లకు డిపాజిట్‌కట్టలేదని.. కనెక్షన్లు తొలగించి గొట్టాలకు బిరడాలు బిగిస్తున్నారు. ఆ ఇళ్లలోని వారు వీధి కుళాయిలనూ వాడుకోకుండా వాటికీ బిరడాలు వేస్తున్న వైనం విమర్శలకు తావిస్తోంది. కాలనీల్లో గతంలో కుళాయిల ఏర్పాటుకు రూ.3 వేలు చెల్లించామని, ఇప్పుడు అనధికార కనెక్షన్ల పేరుతో తొలగిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.
దీనిపై నగర పంచాయతీ కమిషనరు శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి రూ.20 లక్షల బకాయిలున్నాయన్నారు. అనధికార కనెక్షన్లు చాలా ఉన్నాయని, వాటిని చెక్క బిరడాలతో మూసేస్తున్నామని వెల్లడించారు. ఒక్కో దానికి రూ.6400 డిపాజిట్ చెల్లిస్తే వాటిని పునరుద్ధరిస్తామన్నారు.
ఇదీ చదవండి: గొంతెండుతోంది.. మంచి నీళ్లు మహాప్రభో..