ETV Bharat / state

ఏకకాలంలో రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్.. - cochlear implant surgery latest news

కర్నూలు జిల్లా నంద్యాలలో కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్​ను రెండు చెవులకు ఒకేసారి చేశారు. తొలిసారిగా ఇటువంటి చికిత్స చేసి విజయవంతమైనట్లు మధుమణి నర్సింగ్ హోమ్ వైద్యులు తెలిపారు.

Doctors performed cochlear implant surgery
కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేసిన వైద్యులు
author img

By

Published : Apr 11, 2021, 8:27 AM IST

కర్నూలు జిల్లా నంద్యాలలోని మధుమణి నర్సింగ్ హోమ్ ఆస్పత్రిలో రూ.13 లక్షల విలువైన కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్​ను ఉచితంగా చేశారు. వినికిడి లోపం ఉన్న సాత్విక్ అనే రెండు సంవత్సరాల బాలుడికి ఏక కాలంలో రెండు చెవులకు శస్త్ర చికిత్స చేసినట్లు వైద్యుడు సి.మధుసూధన్ రావు తెలిపారు. ఓకే సమయంలో రెండు చెవులకు ఆపరేషన్​ నిర్వహించటం రాయలసీమలో ఇదే తొలిసారని చెప్పారు. శస్త్ర చికిత్స విజయవంతమైనట్లు పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ ఆపరేషన్​ చేసినట్లు చెప్పారు.

ఆపరేషన్​ విజయవంతమైన సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. నంద్యాల పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానందరెడ్డి వైద్యుల సేవలను అభినందించారు. ఏకకాలంలో రెండు చెవులకు చికిత్స పూరైందని బాలుడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శస్త్ర చికిత్స చేయించుకున్న పిల్లలు, వారి తల్లిదండ్రులు, వైద్యులు, ఐఎంఎ జాతీయ సభ్యులు డా.రవి కృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: అతిసారం ఘటన: ఆదోని, గోరుకల్లులో అధికారులపై చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.