కొండపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గరలో 60 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. కొంతమంది స్థానికులు ఆ భూమిని ఆక్రమించుకున్నారు. అదే స్థలంలో గ్రామసచివాలయం నిర్మించాలని అధికారులు గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో.. ముళ్ల కంపను తొలగించేందుకు అధికారులు యత్నించగా... స్థానికులు అడ్డుకున్నారు.
ఇది ప్రభుత్వ స్థలమంటూ తహసీల్దార్ ఆల్ఫ్రెడ్ హెచ్చరికలు జారీ చేయగా.. అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అధికారులతోపాటు 50 మంది పోలీసులు వెళ్లి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. చివరికి.. అందులోని తాత్కాలిక నిర్మాణాలను జేసీబీ సాయంతో తొలగించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ సురేష్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:
వెంకన్నకు అన్నమయ్య కీర్తనలు రాస్తే.. చేతన్ యానిమేషన్ చేశాడు!